జైస్వాల్ సూపర్ సెంచరీ.. ముంబై విజయం
సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ సూపర్ లీగ్‌లో ముంబై బ్యాటర్ యశస్వీ జైస్వాల్ సూపర్ సెంచరీ సాధించాడు. హర్యానాపై ఏకంగా 16 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 48 బంతుల్లోనే సెంచరీ(101) పూర్తి చేసుకున్నాడు. మరో బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ 18 బంతుల్లోనే ఫిఫ్టీ(64) చేశాడు. దీంతో ముంబై 4 వికెట్లతో గెలిచింది. హర్యానా తరఫున కెప్టెన్ అంకిత్(89), నిషాంత్ సింధు(64*) హాఫ్ సెంచరీలు చేశారు.