రాష్ట్ర హైకోర్టు జడ్జిలను కలిసిన ఎస్పీ మాధవరెడ్డి

రాష్ట్ర హైకోర్టు జడ్జిలను కలిసిన ఎస్పీ మాధవరెడ్డి

మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వీ.మాధవరెడ్డి రాష్ట్ర హైకోర్టు జడ్జిలు తుహిన్ కుమార్ గేదెల, మానవేంద్ర రాయ్‌లను జిల్లా కేంద్రంలో వారి స్వగృహంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం పూల మొక్కను అందజేసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆనంతరం జిల్లా సమస్యలపై ఇరువురు చర్చించుకున్నారు. జిల్లా ప్రజలకు న్యాయపరమైన సమస్యలను పరిష్కారం చేయాలని సూచించారు.