వేమలిలో స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం
VZM: గజపతినగరం మండలంలోని వేమలి గ్రామంలో సోమవారం స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైద్యాధికారులు డాక్టర్ సుష్మ డాక్టర్ పుష్పాంజలి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోరాడ సావిత్రి, టీడీపీ నేతలు కోరాడ మోహనరావు, కోరాడ జానకిరావు, మాజీ సర్పంచ్ బైరెడ్డి అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.