'యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

'యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

VZM: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఎస్ కోటలో శనివారం సీఐ నారాయణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన అభ్యుదయం సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. దేశానికి వెన్నెముక లాంటి యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని హేతువు పలికారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాకారానికి కృషి చేయాలని కోరారు.