VIDEO: అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు విరాళం అందజేత
కృష్ణా: పెదపారుపూడి మండలం వానపాములలో డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం గ్రామానికి చెందిన చప్పిడి కిషోర్ రూ.50,000 నగదు విరాళాన్ని అందించారు. ఈ మొత్తాన్ని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా చేతుల మీదుగా గ్రామస్తులకు సోమవారం రాత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని చెప్పారు.