అంబులెన్స్‌లో మహిళ ప్రసవం..తల్లి బిడ్డ క్షేమం

MHBD: మరిపెడ మండలానికి చెందిన వసంత అనే మహిళకు పురటి నొప్పులు వస్తుండడంతో కుటుంబసభ్యులు ఆదివారం ఉదయం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే 108 సిబ్బంది వసంతను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటినొప్పులు ఎక్కువ కావడంతో ఈఏంటి రమణ మహిళకు సుఖప్రసవం చేయగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు.