భారత్ గడ్డపైనే విమానాల తయారీ: కేంద్రమంత్రి

భారత్ గడ్డపైనే విమానాల తయారీ: కేంద్రమంత్రి

ఇకపై భారత్ గడ్డపైనే విమానాలు తయారు చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. త్వరలోనే ఈ కల సాకారమవుతుందన్నారు. భారతీయ వాయుయాన్ అధినియం ద్వారా ఈ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. భారత్ కేవలం విమానాల నిర్వహణకే పరిమితం కాకుండా డిజైన్, తయారీలో అంతర్జాతీయ కేంద్రంగా ఎదగాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు.