ప్రపంచం ముందు ఇరాన్ మహిళల మౌన గర్జన
ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్‌లో ఇరాన్ మహిళా ఫుట్‌బాల్ జట్టు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. నిన్న రాత్రి గోల్డ్ కోస్ట్‌లో దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో జాతీయ గీతం పాడేందుకు క్రీడాకారిణులు, కోచ్ నిరాకరించారు. దేశంపై ఇజ్రాయెల్-US దాడులు, సుప్రీం లీడర్ ఖమేనీ మరణం వంటి ఉద్రిక్తతల మధ్య వారు ఈ మౌన నిరసనను వ్యక్తం చేశారు. వారి ధైర్యం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.