ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఐ
మార్కాపురంలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని సీఐ సుబ్బారావు ప్రత్యేక చర్యలను చేపట్టారు. గురువారం కోర్టు సెంటర్‌లోని సిగ్నల్స్ పాయింట్ వద్ద ట్రాఫిక్‌ను స్వయంగా పరిశీలించారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌కు అనుగుణంగా వాహనదారులు వెళ్లాలని అన్నారు. అనంతరం మాట్లాడుతూ.. మార్కాపురం జిల్లాగా ఏర్పడిందని, దాంతో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశామన్నారు.