మున్సిపల్ కార్మికులకు బట్టలు పంపిణీ చేసిన మంత్రి

మున్సిపల్ కార్మికులకు బట్టలు పంపిణీ చేసిన మంత్రి

NGKL: మక్తల్‌లో శుభ్రత, పరిశుభ్రత పనులు చేసే 45 మంది కార్మికులకు ఉగాది పండుగ సందర్భంగా కొత్త బట్టలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ మైనారిటీ కార్యకర్త బురాన్ ఆధ్వర్యంలో మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా మహిళలు, పురుషులకు బట్టలు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. హిందువుల పండుగలకు కొత్త బట్టలు ధరించాలన్న సంకల్పంతో ముస్లిం నాయకుడు బురాన్ బట్టలు అందించడం అభినందనీయమని అన్నారు.