ఢిల్లీ అసెంబ్లీ ఘటన.. నిందితుడి అరెస్ట్

ఢిల్లీ అసెంబ్లీ ఘటన.. నిందితుడి అరెస్ట్

ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలోకి ఓ కారు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ దుశ్చర్యకు సరబ్ జిత్ అనే వ్యక్తి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అసెంబ్లీ నుంచి పారిపోయిన నిందితుడిని రూప్ నగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఈ ఘటనలో నిందితుడు టాటా సియారా కారును ఉపయోగించాడని దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అసెంబ్లీ వద్ద పోలీసుల వైఫల్యంపై ఆప్ ఆగ్రహం వ్యక్తం చేసింది.