నిన్ను చాలా మిస్ అవుతున్నా: జగన్
AP: మాజీమంత్రి, దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని మాజీ సీఎం జగన్ ఆయన్ను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు భావోద్వేగ సందేశాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. 'నా ప్రియ మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డిని చాలా మిస్ అవుతున్నాను' అని పేర్కొన్నారు. కాగా, గౌతమ్ రెడ్డి ఐటీ మంత్రిగా పనిచేశారు. 2022 ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు.