ఎమ్మెల్యేను కలిసిన మండల నాయకులు

GNTR: తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణకుమార్‌ను శుక్రవారం తుళ్లూరు మండల TDP నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని వారం రోజుల్లో వందశాతం పూర్తి చేస్తామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మూల్పూరి నరేశ్, కాటా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.