VIDEO: మంచం వేసుకుని రోడ్డుపై నిరసన
AP: నెల్లూరు జిల్లాలోని సైదాపురంలో రోడ్లు సరిగా లేవని ఓ యువకుడు నిరసన చేపట్టారు. అధికారులు రోడ్డు పనులను సగంలో ఆపేశారని ఆరోపిస్తూ.. నడిరోడ్డుపై మంచం వేసుకుని కూర్చోని.. వచ్చే వాహనాలను ఆపేశాడు. వెంటనే రోడ్డు వేయాలని స్థానిక ఎమ్మెల్యేని, అధికారులను డిమాండ్ చేశాడు. లేనిపోతే గ్రామస్థులంతా కలిసి డబ్బులు వసూలు చేసి స్వయంగా రోడ్డు వేసుకుంటామని తేల్చి చెప్పాడు.