కలెక్టరేట్‌లో నేడు 'మీకోసం' కార్యక్రమం

కలెక్టరేట్‌లో నేడు 'మీకోసం' కార్యక్రమం

కృష్ణా: ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన 'మీకోసం' కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంచార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఒక ప్రకటన విడుదల చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజానీకం, సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులకు అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ సూచించారు.