'పాఠశాలకు, కళాశాలకు సమీపంలో దుకాణాలను మూసివేయాలి '
నల్గొండలో మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయంపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు టూ టౌన్ ఎస్సై సైదులు స్థానిక పాన్ షాపుల యాజమాన్యాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మైనర్లకు పొగాకు విక్రయిస్తే కేసులు నమోదు చేసి, లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే పాఠశాలలు, కళాశాలల 100 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలను మూసివేయాలని సూచించారు.