బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

NLR: దుత్తలూరులో శుక్రవారం రాత్రి బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. గ్రామంలో మైనర్ బాలికకు వివాహం జరుగుతుందన్న సమాచారంతో తహసీల్దారు నాగరాజు, ఐసీడీఎస్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇరు కుటుంబాల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.