VIDEO: సమస్యలు పరిష్కరించాలని ఆశ కార్యకర్తల ధర్నా

NRPT: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నారాయణపేట మున్సిపల్ పార్క్ వద్ద ఆశ కార్యకర్తల ధర్నా నిర్వహించారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం మాట్లాడుతూ.. ఆశాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని కోరారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.