జేపీ నడ్డా కీలక సమీక్ష

భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కీలక సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఆరోగ్య మౌలిక సదుపాయల సంసిద్ధతపై అధికారులతో చర్చించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ఉండాలని, అన్ని విధాల సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు.