ఏలూరు మెడికల్ కాలేజీలో సద్దుమణిగిన వివాదం
ఏలూరు మెడికల్ కాలేజీలో జూనియర్లు, సీనియర్ల మధ్య తలెత్తిన వివాదం సమసిపోయింది. సీనియర్లు తమపై దాడి చేశారంటూ జూనియర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏలూరు టూటౌన్ సీఐ అశోక్ కుమార్ గురువారం వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం జూనియర్లు సీనియర్లపై పెట్టిన కేసును విత్ డ్రా చేసుకునేందుకు సిద్ధమయ్యారు.