ఎమ్మెల్యే కాన్వాయ్‌ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు

ఎమ్మెల్యే కాన్వాయ్‌ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు

MDK: మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం చివరి రోజు కొల్చారం మండలం రంగంపేటలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు బతుకమ్మ ఆటతో ప్రచారం చేస్తుండగా, నర్సాపూర్ BRS ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కాన్వాయ్ అక్కడికి చేరింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో ఇరు పార్టీల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.