'సదరం శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

'సదరం శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

ASF: ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించనున్న సదరం శిబిరాన్ని వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని DRDA శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 10వ తేదీ నుంచి 31 వరకు జరిగే సదరం శిబిరాలకు హాజరయ్యే వారు ముందుగా PHCలలో వికలత్వ పరీక్ష చేయించుకుని మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. క్యాంపుకు వచ్చినప్పుడు పరీక్ష చేయించుకున్న వికలత్వ పత్రం తీసుకురావాలని పేర్కొన్నారు.