'అబ్దుల్ కలాం విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించండి'

CTR: పుంగనూరులో అబ్దుల్ కలాం విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని ఏపీజే అబ్దుల్ కలాం కమిటీ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ కోరారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఛైర్మన్ నరసింహ ప్రసాద్ రెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. అయూబ్ ఖాన్ మాట్లాడుతూ.. మినీ బైపాస్ రోడ్డులో ఆయన జయంతి సందర్భంగా విగ్రహం ఏర్పాటుకు చొరవ చూపాలని కోరామని అన్నారు.