అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

JGL: రాయికల్ మండలం కుమ్మరిపల్లి గ్రామ శివారులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ నుండి ఐచర్ వ్యాన్‌లో రేషన్ బియ్యాన్ని నిజామాబాద్‌కు తరలిస్తుండగా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు సుమారు 130 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.