ఇరాన్ కీలక ప్రకటన.. భారత్‌కు ఊరట
హార్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఈ వ్యూహాత్మక జలసంధిని నియంత్రించే పూర్తి అధికారం తమకే ఉందని స్పష్టం చేస్తూనే, అన్ని దేశాలకు చమురు సరఫరాను నిలిపివేయాలనే ఉద్దేశ్యం తమకు లేదని తెలిపింది. అయితే US, ఇజ్రాయెల్, యూరప్ దేశాలకు వెళ్లే నౌకలకు మాత్రం ప్రవేశం లేదని తేల్చి చెప్పింది. ఇరాన్ నిర్ణయంతో భారత్ సహా పలు ఆసియా దేశాలకు పెద్ద ఊరట లభించినట్లయింది.