భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
VKB: భర్త వేధింపులు తాళలేక మనస్తాపంతో ఓ వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన యాలాల(M) చెన్నారంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేవి(33)ని ఆమె భర్త హన్మంతు మద్యానికి బానిసై నిత్యం వేధిస్తుండేవాడు. భర్త ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఈనెల 13న పురుగుల మందు సేవించింది. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది.