కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

NLG: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కుటుంబ నియంత్రణ పట్ల అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం ఆమె దేవరకొండ మండలం బొడ్డుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం వెైద్యసిబ్బందికి పలు సూచనలు చేశారు.