'బాల్య వివాహాలతో అనర్థాలు కలుగుతాయి'
CTR: బాల్య వివాహాలతో అనర్థాలు కలుగుతాయని ఐసీడీఎస్ సూపర్వైజరు మల్లీశ్వరి తెలిపారు. సదుం మండలంలోని జాండ్రపేటలో పోషణ్ పక్వాడా కార్యక్రమం గురువారం నిర్వహించారు. పోషకాహార ప్రాముఖ్యతను వివరించారు. పోషకాహార లోపంతో రక్తహీనత ఏర్పడుతుందన్నారు. యోగా ప్రాముఖ్యతను తెలిపారు. అంగన్వాడీలలో పోషకాహారం పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.