రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
అన్నమయ్య: కంభంవారిపల్లె మండలం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఈ నెల 5న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు తహసీల్దార్ నరేంద్ర కుమార్ తెలిపారు. ఇందుకు జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొంటారని చెప్పారు. దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా స్థానికంగా ఈ వేదిక ఏర్పాటు చేశామని ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.