'ఆశా వర్కర్ల శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు'

'ఆశా వర్కర్ల శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు'

SDPT: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు నెలకు రూ. 18 వేల వేతనం ఇవ్వాలని ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. సోమవారం డిమాండ్ల సాధనకై ఇందిరా పార్క్ వద్ద ఆశా వర్కర్లు చేపట్టిన మహా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆశా వర్కర్ల శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదని విమర్శించారు.