'రోడ్డు కల్పించాలని గ్రామస్తుల ఆందోళన'
ASR: పెదబయలు మండలం కొరవంగి నుంచి గజ్జంగివీధి వరకు వెంటనే రోడ్డు వేయాలని స్థానికులు నిరసన చేపట్టారు. అంతా రాళ్లతో నిండి కాలి నడకకు కూడా వీల్లేకుండా మారిన ఈ దారిలో ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర వైద్యానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు వెంటనే స్పందించి పక్కా రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు.