జాతీయస్థాయి క్రీడా పోటీలకు గురుకుల విద్యార్థి ఎంపిక

జాతీయస్థాయి క్రీడా పోటీలకు గురుకుల విద్యార్థి ఎంపిక

NGKL: లింగాలలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి 68వ ఎస్జీఎఫ్ రాష్ట్ర పోటీల్లో శుక్రవారం ఉత్తమ ప్రతిభ చూపి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక అయ్యాడు. హనుమకొండ పట్టణ కేంద్రంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో బీ భాను ప్రసాద్ బీపీసీ 400మీ. పరుగు పందెంలో రెండవ స్థానంలో నిలిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు.