ఇంటింటా పర్యటించిన ఎమ్మెల్యే

NLR: సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా దుత్తలూరు మండలం నర్రవాడ బీసీ కాలనీలో ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ ఇంటింటా పర్యటించారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించి కరపత్రాలు అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు.