VIDEO: "నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న షాప్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలి"

WGL: నల్లబెల్లి మండలం రేలకుంట గ్రామ రైతు ఇస్లావత్ రాజ్‌కుమార్ మూడు ఎకరాల వరి పంట గడ్డి మందు వల్ల ఎండిపోవడంతో నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఆయన నల్లబెల్లి ఎరువుల షాపు ముందు రాస్తారోకో నిర్వహించారు. నష్టపరిహారంగా రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎరువుల షాపు యజమానిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కోరారు. రైతుకు నష్టపరిహారం అందించాలని అధికారులను కోరుతున్నారు.