గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య
మంచిర్యాల: చెన్నూరు మండలం సుందరశాల గ్రామానికి చెందిన బొమ్మ హరికృష్ణ రెడ్డి (28) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువుల వివరాల ప్రకారం.. హరికృష్ణ హైదరాబాద్ వెళుతున్నట్లు ఇంట్లో చెప్పగా, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జ్ లో బస చేసి గడ్డి మందు సేవించి ఇంటికి సమాచారం ఇచ్చాడు. బంధువులు అసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందాడు.