ఉపాధ్యాయురాలీ కుటుంబానికి అండగా ఉంటాం: కలెక్టర్
NLR: ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఉపాధ్యాయురాలు హరితను కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం పరామర్శించారు. బాలాయపల్లి మండలం గొట్టికాడు హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న పండిత హరితపై దాడి చేసిన విషయం తెలిసిందే. దాడి సమయంలో ఆమె చూపిన ధైర్య సాహసాలను ప్రత్యేకంగా అభినందించారు.