VIDEO: మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
శ్రీకాకుళంలోని బలగ హడ్కోకాలనీ మున్సిపల్ పాఠశాలల్లో ఎమ్మెల్యే గొండు శంకర్ మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయంగా తనిఖీ చేశారు. ఈ మేరకు విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన పౌష్టికాహారం అందుతున్నదో లేదో పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ మార్గదర్శకాలు, పౌష్టికాహార ప్రమాణాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.