కిడ్నీ రాకెట్ వ్యవహారంపై దర్యాప్తు
AP: అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని గ్లోబల్ ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్ వ్యవహారంపై వైద్యాధికారుల బృందం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను పలు అంశాలపై ప్రశ్నించింది. మృతదేహానికి మదనపల్లెలో పోస్టుమార్టం ఎందుకు నిర్వహించలేదని వివరాలు తెలుసుకుంది. అనంతరం ఆస్పత్రిని తనిఖీ చేసేందుకు వెళ్లగా.. తాళం వేసి ఉండటంతో అధికారులు వెనుతిరిగి వచ్చారు.