ఘనంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నగరోత్సవం

ఘనంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నగరోత్సవం

ప్రకాశం: చీమకుర్తిలో ఈనెల 20వ తేదీన శ్రీ లక్ష్మీ భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షికోత్సవం నిర్వహించనున్నారు. గోవింద మాలధారణ కలిగిన భక్తుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఆరోజు ఉదయం స్వామి వారికి విశేష పూజలు అభిషేకం జరుగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. స్వామివారి నగరోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు.