మద్దుల్ తండా సర్పంచ్ మెగావత్ అరుణ ఏకగ్రీవం
NZB: ధర్పల్లి మండలం మద్దుల్ తండా సర్పంచ్‌గా తండావాసులు సమిష్టి నిర్ణయంతో మెగావత్ అరుణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తండాకు ఎస్టీ మహిళ రిజర్వేషన్ రావడంతో చదువుకున్న మహిళ సర్పంచ్‌గా ఉంటే తండా అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తండావాసి రాములు నాయక్ తెలిపారు.