'రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలి'

KMM: భూభారతి చట్టం ప్రకారం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. కామేపల్లిలో నిర్వహించిన రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. భూభారతి చట్టం ద్వారా రైతులకు పట్టాదారు పుస్తకాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అటు రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేయాలన్నారు.