VIDEO: మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్

MHBD: మరిపెడ మండలం పురుషోత్తమయగూడెం బంటు వెంకటమ్మ అనే మహిళను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉల్లేపల్లి గ్రామానికి చెందిన వెంకటమ్మ కూలి మేస్త్రీగా పనిచేసేది, నిందితుడు డబ్బులు కోసం ఆమెతో గొడవ పడి గ్రామ శివారులో హత్య చేసినట్లు DSP కిషోర్ సోమవారం మీడియాతో వెల్లడించారు. ముద్దాయి నుంచి బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.