అంబటి నిరాహార దీక్షకు జక్కంపూడి సంఘీభావం
గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు చేపట్టిన నిరాహార దీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. ప్రతిపక్షాలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణం దెబ్బతింటోందని వ్యాఖ్యానించారు.