కుట్టు మిషన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ELR: జీలుగుమిల్లిలో శుక్రవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు పర్యటించారు. గ్రామంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. మహిళల ఆత్మనిర్భరత దృష్ట్యా మిషన్ హోప్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.