VIDEO: రైస్ మిల్లులో ప్రమాదం.. కార్మికుల‌కు తీవ్ర గాయాలు

VIDEO: రైస్ మిల్లులో  ప్రమాదం.. కార్మికుల‌కు తీవ్ర గాయాలు

SRPT: హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీ సాయి బాలాజీ రైస్ మిల్లులో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక సమాచారం మేరకు మిల్లులో బూడిదను లారీలోకి లోడ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ బూడిద కార్మికులపై జారిపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం సూర్యాపేటకు తరలించారు. ఈ ఘోర సంఘటన స్థానికంగా కలకలం రేపింది.