సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ

NDL:సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నంద్యాల మహిళ పోలీస్ స్టేషన్ సీఐ గౌతమి తెలిపారు. మంగళవారం కోయిలకుంట్ల ఎస్సై మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో కోయిలకుంట్ల టౌన్‌లో మహిళలకు చట్టాలపై శక్తి యాప్ ద్వారా మాదక ద్రవ్యాలు, రోడ్డు సేఫ్టీ మహిళల పట్ల జరిగే నేరాలు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుత చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు.