మాట మాట పెరిగి ఓ వ్యక్తిపై కత్తులతో దాడి..!

మాట మాట పెరిగి ఓ వ్యక్తిపై కత్తులతో దాడి..!

అన్నమయ్య: జిల్లా రామసముద్రం మండలంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం ఓ వ్యక్తి బట్టలు ఉతికి ఇంటిపై ఆరివేస్తుండటంతో పక్కింటి వారితో మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు వర్గాలు పరస్పర దాడులకు దిగి ఒకరిని కత్తితో తీవ్రంగా గాయాపరిచినట్లు స్థానికులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు గాయాపడిన వ్యక్తిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.