ఎన్జీ కళాశాలలో జాబ్ మేళా విజయవంతం

ఎన్జీ కళాశాలలో జాబ్ మేళా విజయవంతం

NLG: నల్గొండ ఎన్జీ కళాశాలలో తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ డ్రైవ్‌కు విశేష స్పందన లభించింది. మొత్తం 162 మంది విద్యార్థులు హాజరుకాగా, వివిధ ప్రముఖ కంపెనీలు 57 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.