VIDEO: 'బీఆర్ఎస్‌లో అవినీతి తిమింగలాలు ఉన్నాయి'
వనపర్తిలో రెండేళ్ల అభివృద్ధి పనులపై శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, పదేళ్ల మీ పాలనలో జరిగిన అభివృద్ధిపై శ్వేత పత్రంతో చర్చకు రావాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బహిరంగ సవాలు విసిరారు. గురువారం క్యాంపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో అవినీతి తిమింగలాలు ఉన్నాయని కల్వకుంట్ల కవిత స్వయంగా చెప్పినా ఎవరూ స్పందించలేదని అన్నారు.