రాజధాని రైతులకు ప్లాట్లు కేటాయింపు
GNTR: అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు CRDA అధికారులు సోమవారం రాయపూడి ప్రధాన కార్యాలయంలో 282 ప్లాట్లు కేటాయించారు. 167 నివాస ప్లాట్లు కాగా 115 వాణిజ్య ప్లాట్లు. మొత్తంగా 177 మంది రైతులు, భూయజమానులకు ఈ- లాటరీ విధానంలో ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా ప్లాట్లను కేటాయించడం జరిగిందని అధికారులు చెప్పారు.